టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 9 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో.. కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించాడు. 42 ఓవర్లో విలియం ఒరోర్కే బౌలింగ్ లో సింగిల్ పూర్తి చేసి ఈ ఘనతను అందుకున్నాడు.