హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మరోసారి డ్రగ్స్ మహమ్మారి వెలుగు చూసింది. న్యూ ఇయర్ వేడుకల కోసం క్రాక్ అరేనా అనే పబ్ డ్రగ్స్ పార్టీ అరెంజ్ చేసింది. గచ్చిబౌలి పరిధిలోని ఓ ఈవెంట్‌లో డీజే పార్టీలో డ్రగ్స్ లభించింది. పార్టీకి వచ్చిన 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.