Ranbir Kapoor, Rashmika Mandanna in New 7UP Ad 2024: బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, కన్నడ సోయగం రష్మిక మందన్నాలు బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ హిట్ ఫెయిర్‌గా రణ్‌బీర్-రష్మిక నిలిచారు. ఈ ఇద్దరు యానిమల్ సీక్వెల్‌లో కూడా కనిపించబోతున్నారు. అయితే రణ్‌బీర్, రష్మిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఇద్దరూ కనిపించేది సినిమాలో కాదు.. ఓ కమర్షియల్ యాడ్ కోసం…