మెదక్ జిల్లాలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాలోజి పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ దత్తాశ్రమంలో ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్ల పై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. ఆ గుండ్లను కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి సమయంలో ఆశ్రమంలోకి చొరబడి వృద్ధురాలు అంజమ్మ (75) పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వృద్ధురాలి గొంతు నులిమి మట్టు బెట్టాడు.. అనంతరం…