భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాత పార్లమెంట్ హౌస్‌లోని సెంట్రల్ హాల్‌లో పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.