ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన రోజు వేడుకలు ప్రత్యేకంగా జరిపేందుకు దేశ వ్యాప్తంగా పలు సంస్థలు, బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్గా అజ్మీర్ షరీఫ్‌లో 4000 కిలోల శాఖాహారం లంగర్ కూడా ఏర్పాటు చేశారు.