Amaravathi: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందన్నారు. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని.. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా…