ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అక్కడి మీడియా కథనాలు తెలుపుతున్నాయి. పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లోని ఘోర్ ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదలలో సుమారు 68 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో ప్రజలు వరదలో గల్లంతైనట్లు సమాచారం. ప్రాథమిక నివేదికల ఆధారంగా మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తాలిబన్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. వరదల కారణంగా జిల్లా భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని..…