సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా పలు శాఖలను మూసివేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. కొన్నేళ్లు ఈ బ్యాంక్ ఒడిదొడుకులకు లోను కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 13 శాతం బ్రాంచీలు అంటే దేశవ్యాప్తంగా సుమారు 600 బ్రాంచీలు మూతపడే అవకాశాలున్నాయి. ఒకవేళ శాఖలను మూసివేయడం…