హైదరాబాద్ నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.5కే భోజనం అందించే పథకం మొదలైంది. రోగులతోపాటు ఆస్పత్రులకు వచ్చే సహాయకుల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఒకేరోజు 18 ఆస్పత్రుల్లో ప్రారంభించడం విశేషం. నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది ప్రజలు వైద్యం కోసం రాజధానిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారు. ప్రతి రోగి వెంట వారి బాగోగులు చూసుకోవడానికి కుటుంబసభ్యులు వస్తుంటారు. ఇలాంటివారికి నామమాత్రపు ఖర్చుతో భోజనం అందించడం ఈ పథకం…