సాగర నగరం విశాఖపట్నంలో బైక్ రేసింగ్‌లకు కళ్లెం వేయడానికి సీసీ శంఖ బ్రతబాగ్చి దృష్టిసారించారు. వీకెండ్స్‌లో బైక్‌రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రత్యేక నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గతవారం రోజుల్లోనే 54 మంది రేసర్లను పోలీసులు పట్టుకున్నారు. గతంలో నగరశివారు ప్రాంతాల్లో అకస్మాత్తుగా జరిగే రేసింగ్‌లు.. వీకెండ్స్‌లో సాధారణంగా మారిపోయాయి.