అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను తాను ప్రతిపాదించిన $175 బిలియన్ల ‘గోల్డెన్ డోమ్’ క్షిపణి రక్షణ వ్యవస్థలో ఉచితంగా చేరాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ షరతు విధించారు. “వారు ఒక ప్రత్యేక దేశంగా ఉంటే వారికి $61 బిలియన్లు ఖర్చవుతుందని నేను కెనడాకు చెప్పాను, కానీ వారు అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరితే వారికి సున్నా డాలర్లు ఖర్చవుతాయి” అని ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు.…