లాటిన్ అమెరికా దేశం కొలంబియాలో దారుణం చోటు చేసుకుంది. జైలు నుంచి ఖైదీలు తప్పించుకునే క్రమంలో ఏర్పడిన నిరసనల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఏకంగా 51 మంది ఖైదీలు దుర్మరణం పాలయ్యారు. 24 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ కొలంబియాలోని టోలువాలోని ఒక జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. కొలంబియా న్యాయమంత్రి విల్సన్ రూయిజ్ చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ఖైదీల మధ్య గొడవ జరిగిందని.. ఘర్షణ జరుగుతున్న సమయంలో…