(సెప్టెంబర్ 10న ‘మేరే అప్నే’కు 50 ఏళ్ళు పూర్తి) మనసును కట్టి పడేసే కథలు ఎవరినైనా ఆకట్టుకుంటాయి. అలాంటి కథలను పేరున్నవారు సైతం రీమేక్ చేయడానికి ఇష్టపడతారు. బెంగాలీలో తపన్ సిన్హా రూపొందించిన ‘అపన్ జన్’ ఆధారంగా హిందీలో ‘మేరే అప్నే’ చిత్రాన్ని తెరకెక్కించారు గుల్జార్. ఈ ‘మేరే అప్నే’తోనే గుల్జార్ దర్శకునిగా మారడం విశేషం! ప్రముఖ చిత్ర నిర్మాత ఎన్.సి. సిప్పీ ఈ సినిమాను నిర్మించారు. మీనాకుమారి ప్రధాన పాత్రలో రూపొందిన ‘మేరే అప్నే’ చిత్రంతోనే…