Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని ప్రకృతి విపత్తుల నుంచి రక్షించడంతో పాటు రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతం వరకు పెంచాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం, గ్రీన్ కవర్ మరియు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల అమలులో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా…