ఎవరైనా హీరోలు స్టార్స్ అనిపించుకోవాలంటే బిగ్ స్టార్స్ తోనే పోటీ పడాలని ఓ సినిమా ఫార్ములా ఉంది. దానికి అనువుగా ఎంతోమంది సాగి, విజయం సాధించారు. అలా సాగిన వారిలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా ఉన్నారు. వీరు తమ సీనియర్ స్టార్స్ సినిమాలతో పోటీపడుతూ, సంక్రాంతికి తమ చిత్రాలను విడుదల చేసేవారు. అలా జనం నోళ్ళలో నానడానికి అవకాశం సంపాదించారు. తరువాత స్టార్స్ గా వెలిగారు. కృష్ణ వచ్చీ రాగానే హీరోగా సక్సెస్ చూశారు.…