రష్యా దాడితో ఉక్రెయిన్ దేశం అతలాకుతలం అవుతోంది. అక్కడి ప్రజలు కనీస అవసరాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రిజేంద్ర రానా అనే వ్యాపారి ఉక్రెయిన్‌కు తన వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.40 కోట్లు విలువైన వైద్య పరికరాలు, ఉత్పత్తులను ఉక్రెయిన్దేశానికి ఉచితంగా అందించారు. 1992లో ఉక్రెయిన్‌కు వెళ్లిన బ్రిజేంద్ర రానా అక్కడి ఖార్కీవ్ నగరంలోనే వైద్య విద్యను అభ్యసించారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే స్నేహితులతో కలిసి ఫార్మాసుటికల్ కంపెనీని…