దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. మోర్బీలో నెలకొల్పిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘హనుమాన్జీ4ధామ్’ప్రాజెక్ట్ లో భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని…