కరోనా సమయంలో కరెంట్ వినియోగం తగ్గిపోయింది.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకవడంతో.. మళ్లీ అన్ని సంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి.. దీంతో.. విద్యుత్ డిమాండ్ పెరుగుతూ పోతోంది… ఇదే ఇప్పుడు సమస్యగా మారిపోతోంది… చైనా లాంటి దేశాలు కూడా విద్యుత్ సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి… ఇదే సమయంలో.. భారత్‌కు విద్యుత్ సంక్షోభం తప్పదనే హెచ్చరికలున్నాయి.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. దేశంలోని థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచుతామని.. సంక్షోభాన్ని తప్పిస్తామని అందులో స్పష్టంచేసింది…