ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్‌వార్డ్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 16 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా.. ఈ ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏడు రోజుల్లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.