నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నదిలో వరద ప్రవాహం ‘ప్రమాద’కరంగా పెరుగుతోంది. ఒక్కో అడుగూ పెరుగుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 13.3 అడుగుల వద్దకు చేరింది. దీంతో మరికొద్దిసేపట్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేయనున్నారు. కోనసీమలో గోదావరి ఉధృతంగా ప్రవాహిస్తుండటంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్‌ఎఫ్)ను, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర అర్ధరాత్రి 12 గంటలకు మొదటి…