(సెప్టెంబర్ 19న ‘శాంతి-క్రాంతి’కి 30 ఏళ్ళు) ప్రస్తుతం ఒకే కథను పలు భాషల్లో తెరకెక్కించి, సొమ్ము చేసుకోవాలని మన స్టార్ హీరోస్ తో చిత్రాలు నిర్మించేవారు ఆశిస్తున్నారు. ఆ పంథా కొత్తదేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల నుంచీ ఉంది. అయితే ఇప్పుడు ఆ విధానం మునుపటికంటే మాంచి ఊపు మీద ఉంది. కన్నడ నటదర్శకుడు వి.రవిచంద్రన్ 30 ఏళ్ళ క్రితమే ఈ పద్ధతిలో ‘శాంతి-క్రాంతి’ అనే చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ…