(జూన్ 21న ‘మధురానగరిలో…’కు 30 ఏళ్ళు) భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్. గోపాలరెడ్డికి ‘ఎమ్’ సెంటిమెంట్ లెటర్ అని చెప్పాలి. ఆయన నిర్మించిన ‘మనిషికో చరిత్ర, ముక్కుపుడక, మంగమ్మగారి మనవడు, మాపల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, మురళీకృష్ణుడు, మన్నెంలో మొనగాడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, మాతో పెట్టుకోకు’ చిత్రాలన్నీ అలా ‘మ’ అక్షరంతో మొదలయినవే. వాటిలో బాలకృష్ణతో తెరకెక్కించిన చిత్రాల్లో ఒకటి రెండు మినహా అన్నీ బంపర్ హిట్స్, ఇక యాక్షన్ హీరో…