(జూలై 12తో ‘కూలీ నంబర్ 1’కు 30 ఏళ్ళు) కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘కలియుగ పాండవులు’ చిత్రం ద్వారా హీరోగా జనం ముందు నిలిచారు వెంకటేశ్. తొలి సినిమా సక్సెస్ తోనే ‘విక్టరీ’ వెంకటేశ్ గా జనం మదిని గెలిచారు. ఆ తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్ “భారతంలో అర్జునుడు, ఒంటరి పోరాటం, కూలీ నంబర్ వన్” చిత్రాలలో నటించారు. వీటి తరువాత “ముద్దుల ప్రియుడు, సాహసవీరుడు-సాగరకన్య, సుభాష్ చంద్రబోస్” చిత్రాలలోనూ రాఘవేంద్రరావు, వెంకటేశ్ కాంబో సాగింది. అయితే…