Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్రదాడులతో ఉద్రిక్తంగా ఉంది. వలస కూలీలు, ఆర్మీ జవాన్లు టార్గెట్‌గా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. సోమవారం అఖ్నూర్ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. జవాన్లు తిరిగి ఉగ్రవాదులపై కాల్పులు జరపడంతో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా క్రీరి ప్రాంతంలోని నాజీబాత్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంలో భద్రతా బలగాలు కార్డర్ సెర్చ్ ను ప్రారంభించాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య కాల్పులు జరగడంతో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఎన్ కౌంటర్ లో ఒక పోలీస్ అధికారి కూడా అమరుడయ్యారు. హతమైన ఉగ్రవాదులను జైష్…