3 Store Building Collapsed In Uttarpradesh: ఉన్నట్టుండి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నారు. ఇద్దరు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో జరిగింది. అనుకోకుండా భవనం కుప్పకూలి పోవడంతో చుట్టుపక్కల వారు బిల్డింగ్ లో ఉన్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది బిల్డింగ్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. మరికొందరు భవనంలో ఉండిపోవడంతో శిధిలాల కింద చిక్కుకున్నారు. అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.…