విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3 కోట్లు వసూలు చేశారు దంపతుల జంట. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్‌లో చోటు చేసుకుంది. ఓ సంస్థను కలిగి ఉన్న దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో చదువు, ఉద్యోగం ఇప్పిస్తానని ఓ డాక్టర్‌తో పాటు అతని కుటుంబసభ్యులను రూ.3 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి.