ఎడతెరపిగా కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరుకుంది .ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రము మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద దీనికి తోడుగా దిగువన శబరి నదికి భారీగా వరదరావడంతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. ప్రస్తుతం 51 అడుగులు ఉండటంతో ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఒకవేళ వరద ఉదృతి 53 అడుగులకి చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు…