Maharashtra Elections: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం (అక్టోబర్ 29) నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా.. సుమారు 8 వేల మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నవంబర్ 20న జరగనున్న ఎన్నికల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు 10,905 నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అక్టోబరు 22న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 29వ తేదీతో ముగిసింది.…