సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య డర్బన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. సౌతాఫ్రికా గడ్డపై చెలరేగుతున్నారు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ బరిలోకి దిగారు. అయితే.. బిగ్ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ (7) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకోగా.. మరో ఓపెనర్ శాంసన్ అర్ధ సెంచరీతో చెలరేగారు. క్రీజులోకి దిగిన నుంచి శాంసన్ సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.