పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. కాగా.. 259 పరుగులకు కివీస్ ఆలౌటైంది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 7 వికెట్లు తీసి.. న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.