అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఉపాధ్యాయుడికి 200 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ 64 ఏళ్ల ప్రాథమిక పాఠశాల టీచర్‌ని ఒకప్పుడు ఆదర్శ ఉపాధ్యాయుడిగా భావించేవారు. కానీ తెరవెనుక ఆ వ్యక్తి చేసిన క్రూరత్వం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా, పాఠశాల బాలికలపై క్రూరంగా ప్రవర్తించాడు. చిన్న పిల్లలను సైతం వదిలి పెట్టలేదు.