కేరళలోని వయనాడ్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 204కి చేరింది. అలాగే.. 31 మంది తమిళనాడు చెందిన వారు మిస్సింగ్ కాగా.. 1592 మందిని రెస్క్యూ టీం కాపాడింది. మరోవైపు.. మట్టి కింద మానవ ఉనికిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అత్యంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే.. ఈ ప్రకృతి విధ్వంసం జరిగిన సమయంలో ఓ వ్యక్తి తన కళ్లతో చూసిన విషయాలను తెలిపాడు.