lok sabha Exit polls: దేశవ్యాప్తంగా గత 2 నెలలుగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. శనివారం చివరిదైన 7 వ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత జూన్ 4 వ తేదీన దేశంలో లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలోనే తుది దశ పోలింగ్ ముగియనున్న శనివారం రోజే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్…
పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా శుక్రవారం బీర్భూమ్ చేరుకున్నారు. బెంగాల్‌లో బీర్భూమ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో టీఎంసీ సర్కారు విమర్శనాస్త్రాలు సంధించారు.
కేంద్రం చొరవతో అట్టడుగు స్థాయి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని పేర్కొంటూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి, దేశ ప్రజలకు పోటీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
దేశంలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సహా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ "ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్" 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు.
జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి గెలిస్తే దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అంతేకాదు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రత్యేక కారణం లేదన్నారు.