టెట్‌ను (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నారు. టెట్ పేపర్-1 కోసం 3,51,468 మంది, పేపర్-2 కోసం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి ప్రకటించారు. పేపర్-1 పరీక్ష ఉదయం, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం జరగనున్నాయి. కాగా.. పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం టెట్ మోడల్ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నారాయణగూడలోని పీఆర్‌టీయూ…
తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. మే 11 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కరోనా వల్ల ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే క్లాసులు జరిగాయ్. దీంతో విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అటు పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. తెలంగాణలో చివరిగా టెన్త్ పరీక్షలు 2018-2019…
ప్రతి సంవత్సరంలో కొన్ని రోజులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇలాంటి రోజులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందుకే ఇలాంటి రోజుల కోసం చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. మరి ఇవాళ కూడా ప్రత్యేకమైన రోజే. ఈ రోజు తేదీ అయితే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు తేదీలో 2 అనే సంఖ్య ఆరు సార్లు కనిపిస్తుంది. 22వ తేదీ, రెండో నెల.. 2022 సంవత్సరం. మొత్తం కలిపి చూసుకుంటే 22.02.2022ను సూచిస్తుంది.…
చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలకండికొత్త ఆశలకు స్వాగతం చెప్పండికొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ…ఎన్టీవీ పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత సంవత్సరం వెళ్లిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త ఏడాది వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో కొత్త ఆశలు, ఆశయాలు చిగురిస్తాయి. కొత్తగా ఏదో చేయాలని మన మది పులకరించిపోతుంది. మన మనసు కొత్త అనుభూతికి లోనవుతుంది. గత జ్ఞాపకాలు వెంటాడుతున్నా వాటికి వీడ్కోలు పలికి ఉత్సాహంగా కొత్త ఏడాదిని ప్రారంభిద్దాం. కరోనా కాలానికి గుడ్‌బై…
కరోనా కారణంగా గత ఏడాది చుక్కలు చూపించిన బంగారం ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. తాజాగా ఒమిక్రాన్ ఎఫెక్ట్, ద్రవ్యోల్బణం కారణంగా వచ్చే ఏడాది మరోసారి 10 గ్రాముల బంగారం ధర రూ.55వేలకు చేరుతుందని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా బంగారం దిగుమతి తగ్గిపోవడంతో డిమాండ్ దృష్ట్యా 2020లో 10 గ్రాముల బంగారం రూ.56,200 పలికింది. నాటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 10 శాతం తగ్గింది. Read Also: బీమా కంపెనీల…
ఓవైపు డిసెంబర్ 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీన వైన్ షాపులు, పబ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. మరోవైపు.. హైదరాబాద్ పోలీసులు మాత్రం న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.. న్యూ ఇయర్ వేడుకలపై విధించిన ఆంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్ పోలీస్ కొత్త బాస్ సీవీ ఆనంద్ ఓ ప్రకటన విడుదల చేశారు. న్యూ ఇయర్‌పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసిన ఆయన.. పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి…