2022 తెలుగు చిత్ర పరిశ్రమకు నిరాశాజనకంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. జనవరిలో విడుదలైన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాలేకపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిపైనే ఉంది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి పెద్ద చిత్రాలు ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ మహమ్మారి మూడవ వేవ్ కారణంగా అవి వాయిదా పడ్డాయి. దీంతో సంక్రాంతి పండుగ సీజన్‌లో బంగార్రాజు, రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి వంటి చిత్రాలు విడుదలయ్యాయి.…