ఏపీలో విద్యార్ధులు పరీక్షలకు రెడీ అయ్యే టైం వచ్చింది. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది విద్యాశాఖ. పాత షెడ్యూళ్లను మార్చింది ఏపీ ప్రభుత్వం. దీని ప్రకారం ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మే 6 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది పాఠశాల విద్యాశాఖ.ఉదయం 9.30 గంటల…