గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దానిని యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే టీ20 ప్రపంచ కప్ నిర్వహణ పై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ తెలపడంతో…
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యంపై నిర్ణయం ప్రకటించేందుకు బీసీసీఐకి నాలుగు వారాల సమయమిచ్చినా ఐసీసీ భారత్ లో టోర్నీ నిర్వహించకపోతే.. యూఏఈనే వేదికని చెప్పిందట. బీసీసీఐ కూడా దానికి అంగీకరించినట్టు సమాచారం. అయితే యూఏఈలో టోర్నీ నిర్వహిస్తే అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలే కాకుండా.. నాల్గవ వేదికగా మస్కట్‌ను కూడా ఆ జాబితాలో చేర్చనున్నారట. అయితే ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులను యూఏఈలోనే గత ఏడాది జరిగిన మూడు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది. ఐపీఎల్…