వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు ప్రపంచకప్ గెలవాలన్న కల చెదిరిపోయింది. ఆ సమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ఓటమిపై అప్పటి భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడించాడు. ఆ ఓటమి తర్వాత మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేశారని సంజయ్ బంగర్ చెప్పాడు.