Kadgam: ఖడ్గం.. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఒక భారతీయుడిగా గర్వించదగ్గ సినిమా.. ప్రతి భారతీయుడితో దేశభక్తిని నిద్రలేపి.. జెండా చూడగానే చేయి ఎట్టి సెల్యూట్ చేసేలా చేసిన సినిమా. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో ఏళ్లు.. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సంపూర్ణంగా జరుపుకున్నామంటే అది టీవీలో ఖడ్గం సినిమ చూశాకే అని ప్రజలు చెప్తున్నారు అంటే అతిశయోక్తి లేదు. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికీ 20 ఏళ్ళు పూర్తి చేసుకొంది.
20 Years Of Khadgam: దర్శకుడు కృష్ణవంశీ తన చిత్రాలలో దేశభక్తిని, జాతీయ సమైక్యతను, ఆదర్శభావాలను, పోరాట పటిమను పొందు పరుస్తూ సాగారు. ఆ తీరున ఆయన తెరకెక్కించిన ‘ఖడ్గం’లోనూ ఈ అంశాలన్నీ మనకు కనిపిస్తాయి. దుష్కర చర్యల ముష్యర మూకలు ఓ వైపు, దేశభక్తిని నింపుకున్న హృదయాలు మరోవైపు సాగించిన పోరాటంలో భారతీయులదే అంతిమ విజయం అంటూ ‘ఖడ్గం’ చిత్రం చాటింది. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది. ‘ఖడ్గం’ కథ…