ఎంఐఎం పార్టీ నేతపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ పెట్రోల్ పంపు సమీపంలో మాలెగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై కాల్పులకు పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీకి మాలిక్ ప్రముఖ నాయకుడిగా ఉన్నారు.