మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జబల్‌పూర్ జిల్లాలో రైల్వే ఉద్యోగి, అతని భార్య వారి ఇద్దరు పిల్లలతో సహా కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం భేదాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోడా గ్రామంలో జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ నేమా తెలిపారు.
కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్స్ అయి.. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన సెంట్రల్ ముంబైలో చోటు చేసుకుంది. అనోట్ప్ హిల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో చాలా గంటల పాటు పిల్లలు ఉండటంతో ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు ముస్కాన్ మొహబ్బత్ షేక్ (5), సాజిద్ మహ్మద్ షేక్ (7)గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.