ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థకు సంబంధించిన ‘‘గోల్డె్న్ డోమ్’’ వ్యవస్థను ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో తాను హామీ ఇచ్చినట్లుగా అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని అమెరికా ప్రజలకు అందించబోతున్నట్లు తెలిపారు.