జింబాబ్వే టూర్‌లో పలువురు యువ ఆటగాళ్లకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ మొదటి మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చాడు. కానీ ఈ ముగ్గురిలో ఎవరూ బ్యాటింగ్ లో రాణించలేకపోయారు. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురైల్‌లు టీమిండియా…
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మినహా భారత బ్యాట్స్‌మెన్లు ఎవరూ రాణించలేదు. ఈ క్రమంలో.. 102 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 115 పరుగులు చేసింది. భారత్ తక్కువ పరుగులకే కట్టడి చేసిందని.. 116 పరుగుల లక్ష్యాన్ని ఈజీగానే సాధిస్తుందని అనుకున్నారు. కానీ.. అంతా రివర్స్ అయిపోయింది. జింబాబ్వే బౌలర్ల…
జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత్ తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే 115 పరుగులు మాత్రమే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఈ పరుగులు సాధించింది.
భారత్, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లకు యువ జట్టు సిద్ధమైంది. కాసేపట్లో హరారే వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ టూర్‌లో యువ భారత్ బరిలోకి దిగుతుంది. టీమిండియాకు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ కోసం ఐపీఎల్‌కు చెందిన పలువురు స్టార్ ఆటగాళ్లు భారత జట్టులోకి వచ్చారు. అభిషేక్ శర్మ, రియాగ్ పరాగ్, ధృవ్ జురెల్ అంతర్జాతీయ టీ20లో…