CM KCR: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 ప్రత్యేకమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 1948లో ఇదే రోజున తెలంగాణ రాచరికం అంతమై ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందని గుర్తు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.