ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ విడుదల చేసింది. ఈ గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,121.20 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను, 15వ ఆర్థిక సంఘం నిధులను గత కొద్ది నెలలుగా నిలిపివేసిందని, దీనివల్ల స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతున్నదని సర్పంచుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నాయకులు కలిసిశారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదని , కేంద్ర నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులు వచ్చేలా కేంద్రంపై వత్తిడి తేవాలని విజ్ఞప్తిచేశామన్నారు.…
కేంద్ర ప్రభుత్వం కొత్త నగరాల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నది. 15 వ ఆర్థిక సంఘం దేశంలోని 8 రాష్ట్రాల్లో 8 కొత్త నరగాలకు రూ.8 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసు మేరకు కేంద్రం కూడా నగరాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు కూడా. అయితే, ఇప్పుడు ఆ 8 నగరాల్లో అమరావతి కూడా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. సుమారు 217 చ.కిమీ విస్తీర్ణంలో అన్ని రకాల హంగులతో…