మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవం సినీ రంగానికి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భం విడుదల చేసి మూలవిరాట్ దర్శనం పోస్టర్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయిపోయింది. చిరంజీవి నటిస్తున్న ఈ 154వ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, వి.వి. వినాయక్, పూరి జగన్నాథ్, కొరటాల శివ, ఛార్మి, హరీశ్…