టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ…రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. పాత రికార్డులను బద్దలు చేస్తూ…తన పేరిట లిఖించుకుంటున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ…అంతర్జాతీయ క్రికెట్‌లో 15వేల పరుగులు పూర్తి చేశాడు. మైదానంలో పరుగులతోనే కాదు.. సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లతోనూ….కెప్టెన్ కోహ్లీ రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఓ ఘనమైన రికార్డును అందుకున్నాడు. కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 150 మిలియన్లకు చేరుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్ విరాట్ కోహ్లీ. మొట్టమొదటి ఆసియా వ్యక్తి కూడా అతడే.…