ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 205 పరుగులు చేసింది. దీంతో ఈ స్కోరును అంతంత మాత్రంగా బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న పంజాబ్ అందుకోలేదని అందరూ భావించారు. అయితే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు అద్భుతం చేసి చూపించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అందరూ దంచికొట్టారు. దీంతో కొండంత స్కోర్ కూడా కరిగిపోయింది.…