ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇకపై నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తికి ఈడీ తెలిపింది.
మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. విచారణ సందర్భంగా.. కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. దానిని కోర్టు అంగీకరించింది.